సాహో నుంచి మూడో సాంగ్ వచ్చేసింది

సుజీత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన సాహో మూవీ ఈ నెల 30న రిలీజ్ కానుంది. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సినిమాలోని సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ సాహోపై అంచనాలను పెంచుతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని సైకో.., ఏ చోట నువ్వున్నా.. అనే రెండు సాంగ్స్ రాగా..సోమవారం మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. బ్యాడ్‌ బాయ్‌ అనే సాంగ్  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇందులో ప్రభాస్‌ తో కలిసి శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ చిందులేశారు. ప్రభాస్ చుట్టూ అమ్మాయిలున్నారు. మేబీ ఐ యామ్‌ ఎ బ్యాడ్‌ బాయ్‌ కన్‌ యు బి మై బ్యాక్‌ బోన్‌ హాయ్‌ బేబీ సో.. అంటూ తెలుగు, ఇంగ్లీష్ కలగలిపి ఈ పాట లిరిక్స్‌ రూపొందించారు. జాక్వెలిన్‌ డ్యాన్స్‌,  గ్లామర్ సాంగ్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. భారీ బడ్జెట్‌ తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఆకట్టుకునేలా యాక్షన్ సీన్స్, ముద్దుగులమ్మలతో గ్లామర్ టచ్ ఇచ్చినట్లు ఈ సాంగ్ చూస్తేనే తెలుస్తోంది.

Latest Updates