రేపే సాహో గేమ్ రిలీజ్.. ట్రైలర్ ఇదిగో

వీడియో గేమ్స్‌‌కి మన దేశంలో ఆదరణ పెరుగుతోంది. అందుకేనేమో ‘సాహో’ టీమ్‌‌ దానిపై కన్నేసింది. మూవీ రిలీజ్‌‌ దగ్గర పడుతూ ఉండటంతో చిత్రబృందం ప్రచారంలో వేగం పెంచింది. సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా పబ్లిసిటీని కూడా ప్లాన్ చేసింది. సాహో గేమ్‌‌ని తీసుకొస్తున్నామంటూ సర్‌‌‌‌ప్రైజ్‌‌ ఇచ్చింది. ఆ మధ్య ఈ గేమ్‌‌కి సంబంధించిన పోస్టర్‌‌‌‌ కూడా రిలీజైంది. ఇప్పుడు ట్రైలర్ విడుదలయ్యింది.

ఈ గేమ్ ను లీడ్‌‌ చేసేది ప్రభాస్. పెద్ద పెద్ద బిల్డింగుల మధ్య హెలికాప్టర్లలో అడ్డొస్తున్న శత్రువుల్ని ఫైర్ చేస్తూ దూసుకుపోతున్నాడు. సినిమాలో విజువల్స్ ఎంత రిచ్‌‌గా, క్వాలిటీతో ఉన్నాయో ఇందులో కూడా అలాగే ఉన్నాయ్.

బ్యాగ్రౌండ్‌‌ స్కోర్‌‌‌‌ కూడా చాలా బాగుంది. ప్రభాస్‌‌ మూమెంట్స్‌‌ చాలా రియలిస్టిక్‌‌గా కనిపిస్తున్నాయి. ‘ఇట్స్.. షో టైమ్’ అంటూ అతడు ఆటని మొదలుపెట్టే తీరు రక్తి కట్టింది. గేమ్‌‌ని ఆగస్టు 15న మార్కెట్లో రిలీజ్ చేస్తారు. మామూలు గేమ్స్‌‌నే పిచ్చిగా ఇష్టపడుతున్నారు. అలాంటిది ప్రభాస్‌‌ గేమ్‌‌ అంటే క్రేజ్ ఎలా ఉంటుంది! తప్పకుండా సూపర్‌‌‌‌ హిట్ అవుతుంది. అదే టీమ్‌‌ కాన్ఫిడెన్స్‌‌ కూడా!

Latest Updates