నా డై హార్డ్ ఫ్యాన్స్.. చాలా వైలెంట్

saaho-movie-teaser-release

తెలుగు ప్రేక్షకులు, యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సాహో మూవీ టీజర్ విడుదలైంది. బాహుబలి-2 తర్వాత  ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి ఎన్నో అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి. టీజర్ లోనే సినిమా ఎలా ఉండబోతుందన్నది చెప్పేశాడు దర్శకుడు. టీజర్ చివరలో ప్రభాస్.. శ్రద్ధా కపూర్ విలన్ల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ చోట దాక్కుంటారు. అప్పుడు శ్రధ్ధా ” వీళ్లేవరు” అని అడగ్గా.. ప్రభాస్..  “నా  ఫ్యాన్స్” అని అంటాడు. ” ఇంత వైలెంట్ గా ఉన్నారు” అన్న మరో ప్రశ్నకు సమాధానంగా ” డై  హార్డ్ ఫ్యాన్స్.. ”  అనే చెప్పే  డైలాగ్ టీజర్ లో ఆకట్టుకుంది. టీజర్ చూసి ప్రేక్షకులు పండుగ చేసుకుంటున్నారు.

రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో.. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. వంశీ, ప్రమోద్, విక్కీలు  ఈ చిత్ర నిర్మాతలు. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ఆగష్టు 15 న ఈ సినిమా విడుదల కాబోతుంది.

Latest Updates