సాహో గురించి కొత్త సంగతి

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో. సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పలు భాషల్లో రూపొందుతోంది ఈ మూవీ. ఇండస్ట్రీలోనే ఇది బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని సాహో యూనిట్ చెబుతోంది.

Keep Calm and Race On! అంటున్న ప్రభాస్

ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ కాబోతోంది. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ మూవీ.. ఇపుడు గ్రాఫిక్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో.. ప్రమోషన్ ను కూడా స్పీడప్ చేసింది యూనిట్. తీక్షణమైన చూపులతో రిలీజైన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా కొత్త పోస్టర్ రిలీజైంది.

బైక్ , కార్ స్టంట్స్ మూవీలో మెయిన్ హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు. సాహో చాప్టర్స్ లోనూ వాటినే హైలైట్ చేశారు. బైక్ పై ప్రభాస్ చేసే విన్యాసాలు చూస్తే మతిపోతుందని టాక్ నడుస్తోంది. అలా.. ఓ బైక్ పై ప్రభాస్ ఉన్న ఫొటోను సెకండ్ లుక్ గా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో గాగుల్స్, చెవిలో బ్లూటూత్ తో ప్రభాస్ స్టైలింగ్ ఆకట్టుకుంటోంది.

Latest Updates