సాహో – ప్రి రిలీజ్ ఈవెంట్ ప్రారంభం

saaho-pre-release-event-started-in-ramoji-film-city

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన బహుభాషా సినిమా సాహో – ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం భాషల్లో ఆగస్ట్ 30న సాహో సినిమా విడుదలవుతోంది. ఈ మూవీకి సంబంధించిన 2 పాటలను ఇప్పటికే విడుదల చేశారు. మిగతా పాటలను ప్రి-రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేయబోతున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్.. సాహోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. తనిష్క్ బాగ్చి, గురు రాంధావా కంపోజ్ చేసిన  2పాటలను ఇప్పటికే రిలీజ్ చేశారు. సాహో ప్రి-రిలీజ్ ఈవెంట్ ను మూవీ మేకర్స్ సోషల్ మీడియా అకౌంట్స్ లో లైవ్ లో టెలికాస్ట్ చేస్తున్నారు.

Latest Updates