సాహో ఫస్ట్ సాంగ్ టీజర్ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  హీరోగా చేస్తున్న సాహో ఫస్ట్ సాంగ్ టీజర్ వచ్చేసింది. సైకో సయాన్ అంటూ సాగే ఈ సాంగ్ ను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది.  28 సెకన్ల నిడివి గల ఈ పాటలో  ప్రభాస్, శ్రద్ధా కపూర్ లు తమ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు.  జూలై 8 న ఈ పాట పూర్తి లిరికల్ వీడియో విడుదల కానుంది.

సుజీత్ దర్శకత్వం వహిస్తన్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. వచ్చే నెల 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది.

Latest Updates