ఆగస్ట్ 10న సాహో ట్రైలర్.. క్యారెక్టర్లు ఇవే

saaho-trailer-will-be-launched-on-august-10th

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా సాహో. ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు, మూవీ లవర్స్ అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. టీజర్, క్యారెక్టర్ల పరిచయంతో క్యూరియాసిటీ పెంచేసిన సాహో యూనిట్.. కొత్తగా మరో ఇంట్రస్టింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆగస్ట్ 30న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్ట్ 10న అంటే.. ఎల్లుండి శనివారం విడుదల చేయబోతున్నామని ప్రకటించింది.

అత్యంత భారీ స్థాయిలో నిర్మితమై.. అంతే స్థాయిలో చర్చకు కారణమవుతూ.. అందరూ ఎదురుచూస్తున్న తమ సినిమా అన్ని హంగులతో వస్తోందని చిత్రయూనిట్ సోషల్ మీడియాలో చెప్పింది. బ్లాక్ షేడ్ లో ప్రభాస్ ఉన్న ఫొటోను షేర్ చేసింది.

సాహో క్యారెక్టర్లు ఇవిగో

మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో.. సాహో టీమ్ ప్రమోషన్ ను స్పీడప్ చేసింది. సినిమాలోని ఒక్కో కీలక పాత్రను వరుసగా పరిచయం చేస్తోంది.

పాత్ర పేరు ఇబ్రహీం – నటుడు లాల్ – క్యాప్షన్ -Beware Of Loyalty

పాత్ర పేరు దేవ్ రాజ్ – నటుడు చుంకీ పాండే – క్యాప్షన్ – Rise From The Ashes

పాత్ర పేరు – విశ్వాంక్ – నటుడు అరుణ్ విజయ్ – క్యాప్షన్ – Blood Doesn’t Need Bloody Invitation

మిస్టీరియస్ క్యారెక్టర్ – నటుడు – నీల్ నితిన్ ముకేశ్ – క్యాప్షన్ – The End Doesn’t Answer Everything

 

Latest Updates