శబరిమలలో కుంభమాస పూజలు

  • నేటి నుంచి ఐదురోజుల పాటు తెరుచుకోనున్న ఆలయ తలుపులు

తిరువనంతపురం: కుంభమాసం సందర్భంగా మంగళవారం శబరిమల ఆలయం తెరుచుకోనుంది. నెల వారి పూజల కోసం ఐదురోజుల పాటు ఆలయాన్ని తెరుస్తున్నట్లు దేవస్థానం వర్గాలు చెప్పాయి. ఈ సందర్భంగా స్వామికి లక్షార్చన, సహస్ర కలశం తదితర ప్రత్యేక పూజలు చేస్తారని పూజార్లు చెప్పారు. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. నీలక్కల్ నుంచి  సన్నిధానం వరకు నిషేదాజ్ఞలు విధించినట్లు పోలీసులు చెప్పారు. ఉదయం పది గంటల తర్వాత భక్తులను, మీడియాను అనుమతిస్తారు. అన్ని వయసుల మహిళలు అయ్యప్పను దర్శించుకోవచ్చని సుప్రీం ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మహిళలను ఆలయంలోకి అనుమతించేందుకు తమకు అభ్యంతరం లేదని దేవస్వం బోర్డు ఇటీవల సుప్రీం కోర్టుకు చెప్పింది.

Latest Updates