ఈ నెల 14న తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం ఈనెల 14న తిరిగి తెరుచుకోనుంది. మలయాళం మాసమైన మిథునం 15నుంచి ప్రారంభంకానుంది. దీంతో ఆచారం ప్రకారం భక్తులు మాసపూజ, శబరిమల ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈనెల 28వరకు ఆలయాన్ని తెరువనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు… తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ప్రభుత్వ  కరోనా  జాగ్రత్త రిజిస్టేషన్‌ పోర్టల్లో నవెూదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తమకు ఎలాంటి ప్రాణాంతక ఇన్ఫెఫెక్షన్స్‌ లేవని నిర్దారిస్తూ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ ఐసీఎంఆర్‌ ల్యాబ్‌ జారీ చేసిన సర్టిఫికెట్ ను పోర్టల్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. పంపా, సన్నిదానంలోనే భక్తులను తనిఖీ చేసి పంపుతామని, భక్తులు తప్పక మాస్కులు ధరించాలని.. ముందు జాగ్రత్త చర్యగా విశ్రాంత సమయంలో పరిసరాల్లో శానిటేషన్‌  చేయనున్నట్లు తెలిపారు.

Latest Updates