ప్రవేశ పరీక్షలు, విద్యాసంవత్సరంపై సమీక్ష..ఆగ‌స్ట్ 31న ఈసెట్..?

కరోనా నేపథ్యంలో వివిధ ప్రవేశ పరీక్షలు, విద్యా సంవత్సరం అమలు విధి విధానాలను ఖరారు చేసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డితో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 31న ఈసెట్,సెప్టెంబర్ 1వ తేదీ తరువాత ఇంటర్ అడ్మిషన్ల పై నిర్ణయం,సెప్టెంబర్ 2న టీపీఎస్ ద్వారా పాలిసెట్ ఆన్ లైన్ ఎంట్రెన్స్ పరీక్షలు, సెప్టెంబర్ 9, 10, 11, 14న ఎంసెట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిందుకు యోచిస్తున్నట్లు మంత్రి సబిత తెలిపారు. అయితే ఎంసెట్ నిర్వ‌హ‌ణ‌ హైకోర్టు అనుమతితో నిర్వహించాల్సి ఉంటుందని పాపిరెడ్డి పేర్కొన్నారు.

Latest Updates