కరోనాపై పోరుకు సచిన్‌‌ రూ.50 లక్షల విరాళం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై  పోరాటానికి స్పోర్ట్స్ స్టార్స్ ముందుకొస్తున్నారు.చేతనైనంత సాయం చేస్తూ కఠిన పరిస్థితుల నుంచి దేశ ప్రజలను రక్షించడానికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాటింగ్  లెజెండ్​  సచిన్ టెండూల్కర్ శుక్రవారం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఈ మొత్తంలో నుంచి చెరో రూ.25 లక్షలను పీఎం, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌‌కు ఇవ్వాలని నిర్ణయించాడు. ఇక, స్టార్‌‌ స్ప్రింటర్‌‌ హిమ దాస్‌‌ తన నెల జీతాన్ని అస్సాం ప్రభుత్వానికి అందజేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, తాను నిర్వహిస్తున్న రెండు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు అండగా నిలుస్తానని లెజెండరీ షూటర్‌‌ అభినవ్‌‌ బింద్రా చెప్పాడు.

For More News..

కరోనా మందనుకొని తాగి 300 మంది మృతి

Latest Updates