ప్లా స్మా సెంటర్‌‌నుప్రారంభించిన సచిన్‌

ముంబై: కరోనా పేషెంట్లకు చికిత్స కోసం ఏర్పాటు చేసిన ప్లాస్మా థెరపీ యూనిట్‌‌ను.. ఇండియన్‌ లెజెండ్‌ ‌బ్యాట్స్‌‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ ‌బుధవారం ఓపెన్ చేశాడు. సబర్బన్‌ అంధేరిలోని సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో దీనిని ఏర్పాటు చేశారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేయాలని మాస్టర్‌ ‌పిలుపునిచ్చాడు. దీనివల్ల కొంత మంది ప్రాణాలైనా కాపాడే చాన్స్ ఉంటుందన్నాడు. ‘కరోనాతో హెల్త్ పరంగాఊహించలేనన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. వీటి నుంచి ప్రాణాలను కాపాడుకోవాలంటే ప్లాస్మా చికిత్స ఒక్కటే మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరు ప్లాస్మాను దానం చేయాలి. ఈ కష్టకాలంలో డాక్టర్లు, నర్సు‌లు, పారా మెడికల్‌ స్టాఫ్‌‌, పోలీసులు, మున్సిపల్‌‌, గవర్నమెంట్‌‌స్టాఫ్‌ ‌అందిస్తున్న సేవలు మరువలేనివి. క్రిటికల్‌‌గా ఉన్న పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్‌‌మెంట్‌ ‌మంచి ఫలితాలను ఇస్తుంది’ అని సచిన్‌ వ్యాఖ్యానించాడు.

Latest Updates