కరోనాపై పోరు టెస్ట్ క్రికెట్ లాంటిది : సచిన్

కరోనాపై పోరాటాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్ తో పోల్చారు. టెస్ట్ క్రికెట్ లో విజయం కోసం ఎంతో సహనం, టీమ్ స్పిరిట్ ఉండాలనీ… అలాగే కరోనా వైరస్ పై విజయం సాధించాలంటే ఓర్పు, సమష్టిత్వం ఎంతో అవసరమన్నారు సచిన్. T20 క్రికెట్ కు ఆటగాడి వ్యక్తిగత నైపుణ్యం ప్లస్ పాయింట్ అని… అదే టెస్టుల విషయానికొస్తే పార్ట్ నర్ షిప్, టీమ్ వర్క్ చాలా ముఖ్యమన్నారు. ప్రస్తుతం వివిధ దేశాలు వివిధ స్థాయుల్లో కరోనాపై పోరాడుతున్నాయని… అన్ని దేశాలు వారిని ఒక టీమ్ లో భాగంగా భావించుకోవాలని అన్నారు. కరోనాపై పోరాటాన్ని టెస్టు మ్యాచుల్లో సెషన్ల వారీగా ఎదుర్కొని… చివరకు విజేతలుగా నిలవాలన్నారు సచిన్.

 

 

Latest Updates