కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులకు పైలట్ యత్నాలు?

న్యూఢిల్లీ: రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో పాటు 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం ఆరంభమై దాదాపు నెల దాటుతోంది. అయితే ఈ సమస్య కొలిక్కి వచ్చేలా ఉంది. తాజాగా సచిన్ పైలట్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడానికి యత్నిస్తుండటం దీనికి ఊతం ఇస్తోంది. ఈ విషయాన్ని పార్టీలోని ఇద్దరు సీనియర్ లీడర్లు తెలిపారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కావాలని అడిగారని చెప్పారు. అయితే పైలట్‌ను కలవడానికి రాహుల్ సరేనన్నారా లేదా అనేది ఇంకా తెలియ రాలేదు. ఇరు నేతల మధ్య మంచి సంబంధాలున్న దృష్ట్యా సంప్రదింపులకు చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీన్ని ఖండించిన పైలట్.. ఈ విషయం గురించి మాట్లాడటానికి మాత్రం నిరాకరించారు.

Latest Updates