గల్లీలో సచిన్ సిక్సర్.. బాలీవుడ్ సెలబ్రిటీల బౌలింగ్

గల్లీలో ఎవడైనా ఆడతాడు.. కానీ.. స్టేడియంలో సిక్సర్ కొట్టినోడే టెండూల్కర్ అవుతాడు అనేది .. సాహో హిందీ సినిమా టీజర్ లో వినిపించిన మాట. సాహో సినిమా రన్ అవుతున్న ఈ టైమ్ లోనే.. వెరైటీగా… సచిన్ టెండూల్కర్ .. గల్లీలో సిక్సర్ బాదాడు. ఈవీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా లెజెండరీ క్రికెటర్, క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గల్లీ క్రికెట్ ఆడాడు. ఆగస్ట్ 29న ఫిట్ ఇండియా మూవ్ మెంట్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. స్వచ్ఛభారత్ లాగే.. ఈ కార్యక్రమాన్ని కూడా దేశమంతటా ప్రచారం చేయాలని సెలబ్రిటీలను కోరారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్.. బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. ఈ వీడియో షూటింగ్ వీడియోను, వరుణ్ ధావన్ తో చిట్ చాట్ వీడియోలను సచిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

వరుణ్ ధావన్ బౌలింగ్ లో సచిన్ సిక్సర్లు, బౌండరీలు కొట్టాడు. అభిషేక్ బచ్చన్ కూడా సచిన్ కు బౌలింగ్ చేశాడు. ఐతే… గెలిచేందుకు అవసరమైన రన్స్ ను సచిన్ బౌలింగ్ లో వరుణ్ కొట్టలేకపోయాడు. బౌలింగ్ బాగా చేస్తున్నావంటూ ఓ లోకల్ అమ్మాయికి బాల్ ఇచ్చి సచిన్ ఎంకరేజ్ చేశాడు. సచిన్ ఆడిన గల్లీ క్రికెట్ అందరితో ఈలలు వేయించింది. ఆటలు ఫిట్ నెస్ పెంచుతాయని సచిన్, వరుణ్ ధావన్ తమ ఇంటర్వ్యూతో మెసేజ్ ఇచ్చారు.

Latest Updates