‘బార్బర్ గర్ల్స్’ ను అభినందించిన సచిన్

‘బార్బర్ గర్ల్స్’ ను సచిన్ అభినందించారు. వారితో షేవింగ్ చేయించుకుని సోషల్ మీడియా లో ఫొటోను పోస్ట్ చేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బన్వారీ తోలా గ్రామానికి చెందిన నేహ, జ్యోతి అనే ఇద్దరు అక్కాచెల్లెల్లు… 2014 నుంచి బార్బర్ షాన్ ను నిర్వహిస్తున్నారు. వాళ్ల తండ్రి అనారోగ్యం పాలుకావడంతో రోజు గడవడం కష్టంగా మారింది. దీంతో తన తండ్రి నడిపించిన బార్డర్ షాప్ లో పనిచేస్తూ ఇటు కుటుంబానికి. అటు తండ్రికి కావలసిన హాస్పిటల్ కర్చులకూ.. ధనాన్ని సంపాదిస్తున్నారు.  ముందు మగపిల్లల్లా డ్రెస్ వేసుకుని కస్టమర్స్ కు కటింగ్ చేసేవాళ్లు. కొద్దిరోజులకు అమ్మాయిలని తెలిసాక దేశం మొత్తం వారి పేరు మారుమ్రోగిపోయింది.

తాజాగా.. జిల్లెట్ సంస్థ నేహ, జ్యోతిలపై యాడ్ ఫిల్మ్ తీసి ప్రచారాన్ని కల్పించింది. దీంతో పాటే సచిన్ టెండుల్కర్ కూడా వారి షాప్ కు వచ్చి అభినందించారు. ఆపై.. వారితో షేవింగ్ చేయించుకుని ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టారు. జిల్లెట్ సంస్థ అందించిన స్కాలర్ షిప్ ను ఆ అక్కాచెల్లెల్లకు సచిన్ అందించారు. ఈ విషయాన్ని సచిన్ ట్వీట్ చేస్తూ. నా కేరీర్ లో ఇప్పటివరకూ ఎవరితో షేవింగ్ చేయించుకోలేదు. ఇప్పుడే ఆ రికార్డ్ బ్రేక్ అయిందని సరదాగా తెలిపారు.

Latest Updates