సచిన్, లారా మరోసారి బరిలోకి

ముంబై : బ్యాటింగ్‌ లెజెండ్స్‌ సచిన్‌ టెండూల్కర్‌ , బ్రియాన్‌ లారా చాలా ఏళ్ల తర్వాత మరోసారి బరిలోకి దిగనున్నారు. తమ బ్యాటింగ్‌ తో అభిమానులకు కనులవిందు చేయనున్నారు. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే రోడ్‌‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ ఈ లెజెండ్స్‌ ఆటకు వేదిక కానుంది. ఏడాదికోసారి జరిగే ఈ టీ20 టోర్నమెంట్‌ లో ఇండియా, వెస్టిండీస్‌ , ఆస్ట్రేలియా, శ్రీలంక,సౌతాఫ్రికాకు చెందిన రిటైర్డ్‌ క్రికెటర్లు పాల్గొంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుం చి16వ తేదీ మధ్య జరిగే టోర్నీలో సచిన్‌ , లారాతో పాటు సెహ్వాగ్‌ , బ్రెట్‌ లీ, దిల్షాన్‌ , జాంటీ రోడ్స్‌ తదితరులు బరిలోకి
దిగనున్నారు.

Latest Updates