సచిన్‌కు అత్యంత అరుదైన గౌరవం

sachin-tendulkar-inducted-into-icc-hall-of-fame

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్… ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న సచిన్‌కు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే అభినందనలు తెలిపాడు.

ఆసీస్‌కు రెండుసార్లు ప్రపంచకప్ అందించిన విమెన్ క్రికెటర్ కేథరిన్ ఫిట్జిప్యాట్రిక్‌లకు కూడా ICC హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. క్రికెట్‌కు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంతోపాటు క్రికెట్ అభివృద్ధికి చేసిన కృషికి గాను వీరికి ఈ గౌరవం లభించింది.

Latest Updates