క్రికెట్ గాడ్ సచిన్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డ్

క్రికెట్ గాడ్ గా పిలుచుకునే సచిన్ టెండుల్కర్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డ్ లభించింది.  లారస్ స్పోర్టింగ్ మొమెంట్ 2000-2020 అవార్డును గెలుచుకున్నారు. 2011లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సహచరులంతా సచిన్ ను భుజాలపై ఎత్తుకొని గ్రౌండ్ చుట్టూ తిప్పిన ఘటనకు ఈ అవార్డు వచ్చింది.

భుజాలపై ఎత్తుకెళ్లిన ఘటనను గత 20 ఏళ్లల్లో ప్రపంచ క్రీడల్లో అపూరూపమైన క్షణంగా  లారస్ స్పోర్టింగ్ మొమెంట్  ఎంపిక చేసింది. లారస్ స్టోర్టింగ్ అవార్డుల ఓటింగ్ లో సచిన్ కు అత్యధిక ఓట్లు రావడంతో ఈ అవార్డ్ అందజేశారు. ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ వా సచిన్ కు ఈ అవార్డ్ ను అందించారు. ఈ సందర్భంగా అవార్డ్ అందుకున్న సచిన్ అప్పటి క్షణాల్ని గుర్తుచేసుకున్నాడు. ప్రపంచ కప్ గెలవడమనేది మాటల్లో చెప్పలేని అనుభూతి అని అన్నారు.

Latest Updates