అమ్మ పాదాలకు మొక్కి..సాదాసీదాగా సచిన్ బర్త్ డే

న్యూఢిల్లీతన బ్యాటింగ్​తో క్రికెట్​ప్రపంచాన్ని శాసించిన.. క్రికెట్​ లెజెండ్ సచిన్​ టెండూల్కర్ శుక్రవారం 47వ పడిలోకి అడుగుపెట్టాడు. కరోనా వైరస్​తో పోరాడుతున్న ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు గౌరవార్థంగా బర్త్​డే సెలబ్రేషన్స్​కు దూరంగా ఉన్న మాస్టర్.. సాదాసీదాగా గడిపేశాడు. ఉదయాన్నే తల్లి పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న సచిన్​కు..  గణపతి బొమ్మ రూపంలో ఆమె ఫస్ట్​గిఫ్ట్ ఇచ్చింది. జీవితంలో తొలిసారి బర్త్​డే వేడుకలకు దూరంగా ఉన్నా.. తల్లి ఇచ్చిన వెలకట్టలేని  కానుకతో ఉప్పొంగిపోయాడు. ఇక క్రీడా ప్రపంచం మొత్తం సచిన్​కు బర్త్​డే విషెస్​ చెప్పేందుకు పోటీపడింది. ప్రతి ఒక్కరు సోషల్​ మీడియా వేదికగా మధురానుభవాలను పంచుకున్నారు. ‘సచిన్, సచిన్, సచిన్, హ్యాపీ బర్త్​డే’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్​చేశారు. స్టేడియంలో మాస్టర్​ బ్యాటింగ్ ​చేస్తున్నప్పుడు ప్రేక్షకులు చేసే చాంటింగ్​ను స్ఫూర్తిగా తీసుకుని మోడీ మూడుసార్లు సచిన్​ అంటూ రాసుకొచ్చారు. ఇక ‘ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని’ బీసీసీఐ ప్రెసిడెంట్​సౌరవ్​ గంగూలీ, ‘నీ బ్యాటింగ్​తో కాలాన్నే ఆపేశావు’ అంటూ సెహ్వాగ్, ‘క్రికెట్​పై ఉన్న మక్కువతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచావని’ టీమిండియా కెప్టెన్​విరాట్​కోహ్లీ ట్వీట్ చేశారు. ‘ప్రియమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి మీరు ఎప్పుడూ స్ఫూర్తిప్రదాతగా నిలువాలని కోరుకుంటున్నా. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలి’ అని హైదరాబాదీ వీవీఎస్​లక్ష్మణ్​ వ్యాఖ్యానించాడు. వీళ్లతోపాటు రోహిత్, బుమ్రా, యువరాజ్, హర్భజన్, రైనా, బ్రెట్ ​లీ తదితరులు కూడా శుభాకాంక్షలు చెప్పారు.

Latest Updates