ఆన్ లైన్ లో ఫ్రీగా సచిన్ క్రికెట్ పాఠాలు..

ఫ్రీగా క్రికెట్ పాఠాలు నేర్పేందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సిద్దమయ్యాడు. క్రికెట్ పై ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఉచితంగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నాడు. ఇందు కోసం ఎడ్యుకేషన్ టెక్ స్టార్టప్ అయిన అన్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.  దీనికి తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండనున్నాడు. ఇందులో ఫ్రీగా క్రికెట్ పాఠాలు, ట్రిక్స్ చెప్పనున్నాడు. అన్ అకాడమీలోకి లాగిన్ అయ్యి ప్రీగా సచిన్ పాఠాలు వినవచ్చు. సచిన్ తన జీవిత పాఠాలను పంచుకుంటాడని అన్ అకాడమీ కో ఫౌండర్ గౌరవ్ ముంజాల్ చెప్పాడు. తన విజన్ ,అన్ అకాడమీ విజన్ ఒకేలా ఉండటంతో ఈ ఆలోచన చేసినట్లు సచిన్ చెప్పాడు. మారుమూల ప్రాంతాల వారు కూడా నేర్చుకునేందుకు అన్ అకాడమీ ఉపయోగపడుతుందన్నారు.

Latest Updates