డాక్టరొద్దన్నా.. బ్యాట్‌‌ పట్టనున్న సచిన్‌‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా బుష్‌‌ ఫైర్‌‌ బాధితులకు సాయం చేసే విషయంలో  ఇండియన్‌‌ క్రికెట్‌‌ లెజెండ్‌‌ సచిన్‌‌ టెండూల్కర్‌‌ మరో ముందడుగు వేశాడు. భుజం గాయం వల్ల ఆటకు దూరంగా ఉండాలంటూ డాక్టర్‌‌ చేసిన సూచనను పక్కనపెట్టి మరీ బ్యాటింగ్‌‌ చేయనున్నాడు.

కోచ్‌‌గా ఇప్పటికే బుష్‌‌ఫైర్‌‌ బాష్‌‌లో భాగమైన సచిన్‌‌.. మరిన్ని విరాళాల సేకరణకు బ్యాట్‌‌ పట్టుకోనున్నాడు.  చారిటీ మ్యాచ్‌‌ ఇన్నింగ్స్‌‌ బ్రేక్‌‌లో ఓ ఓవర్‌‌ బ్యాటింగ్‌‌ చేయనున్నాడు. ఆస్ట్రేలియా మహిళల టీమ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ ఎలైస్​ పెర్రీ ఆ ఓవర్‌‌ వేయనుంది.

మరిన్ని వార్తల కోసం

Latest Updates