జీవితాన్ని స్ట్రెయిట్ డ్రైవ్ చేయమని చెప్పారు – సచిన్

టీచర్స్ డే సందర్భంగా తన క్రికెట్ గురువు రమాకాంత్ అచ్రేకర్ ను గౌరవిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పడంలోనే కాదు.. జీవితంలో విలువలు నేర్పడంలోనూ చాలా కీలక పాత్ర పోషిస్తారని అన్నారు సచిన్. “ఫీల్డ్ లోనే కాదు.. జీవితంలోనూ స్ట్రెయిట్ గా ఆడాలని అచ్రేకర్ సర్ నాకు బోధించారు. ఆయనకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. నా జీవితాన్ని మలచడంలో ఆయన పాత్రకు కొలమానం లేదు. ఆయన చెప్పిన పాఠాలే నాకు ఇప్పటికీ నడిపిస్తున్నాయి” అని సచిన్ అన్నాడు.

సచిన్ కామెంట్ పై ఫ్యాన్స్ నుంచి పెద్దఎత్తున స్పందన కనిపించింది. గంతలో అచ్రేకర్, సచిన్ కు మధ్య ఉన్న అనుభవాలను కామెంట్ల రూపంలో షేర్ చేశారు అభిమానులు. ఓసారి సచిన్ మ్యాచ్ ఆడకుండా గ్యాలరీలో ఉండిపోయారనీ.. అప్పుడు అచ్రేకర్… సచిన్ చెంపపై కొట్టారని అన్నారు. వేరేవాళ్లు అడుతుంటూ చప్పట్లు కొట్టడానికి నీవు ఇక్కడకు రాలేదు… నువ్వు ఆడుతుంటే మిగతావాళ్లు చప్పట్లు కొట్టాలి… అని మ్యాచ్ ప్రాధాన్యత గురించి సచిన్ కు అచ్రేకర్ వివరించినట్టు చెప్పారు అభిమానులు.

Latest Updates