పుట్టిన రోజు వేడుకలకు సచిన్ దూరం

ఇవాళ(శుక్రవారం,ఏప్రిల్-24) క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌  47వ పుట్టిన రోజు. అయితే బర్త్ డే వేడుకలు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. దేశంలో కరోనా వైరస్  వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ మరోసారి పొడిగించింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో సంబరాలకు ఇది సమయం కాదని సచిన్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి గౌరవార్థం తన పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది తదితరులుకు తను ఇస్తున్న గౌరవంగా తెలిపారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన టీమ్‌ మాస్క్‌ ఫోర్సులో చేరిన సచిన్‌ తమ జట్టులో చేరవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సచిన్‌ ఇప్పటికే ప్రధాని రిలీఫ్‌ ఫండ్‌కు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 50లక్షల రూపాయలు విరాళమిచ్చారు.

Latest Updates