మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టుకు హాజరైన సాధ్వి ప్రగ్యా

మాలేగావ్ పేలుళ్ల కేసులో భోపాల్ ఎంపీ సాధ్వి ప్రగ్యా ఠాకూర్.. ముంబైలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టుకు హాజరయ్యారు. పేలుళ్ల గురించి తనకేం తెలియదని కోర్టుకు చెప్పారు. ప్రగ్యా సమాధానంతో.. కోర్టు షాకైంది. భోపాల్ ఎంపీగా ఎన్నికైన తర్వాత.. ప్రగ్యా ఠాకూర్ తొలిసారి కోర్టుకు హాజరైంది.

2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ బాంబు పేలుళ్లలో ఉపయోగించిన బైక్.. ప్రగ్యా పేరుపై ఉండటంతో ఆమెను అరెస్ట్ చేశారు. 2017లో బాంబే హైకోర్టు ఈ కేసులో ప్రగ్యాకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మధ్యే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రగ్యా ఠాకూర్ భోపాల్ ఎంపీగా ఎన్నికయ్యారు.

Latest Updates