గాంధీని చంపిన గాడ్సేపై సాధ్వి ప్రజ్ఞ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే దేశభక్తుడేనంటూ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కామెంట్ చేయడంపై బుధవారం లోక్ సభలో దుమారం రేగింది. ఎస్పీజీ సవరణ బిల్లు పై చర్చలో భాగంగా నేషనల్ లీడర్ల సెక్యూరిటీపై డీఎంకే ఎంపీ డి.రాజా మాట్లాడుతూ.. గాడ్సే దురాగతాన్ని ప్రస్తావించారు. రాజాకు అడ్డుపడుతూ ‘‘ఇలాంటి ఉదాహరణకు ఒక దేశభక్తుడి పేరెందుకు తీసుకున్నారు?’’ అని సాధ్వి ప్రజ్ఞ అన్నారు. ఆమె కామెంట్లపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పడంతో సాధ్విని కూర్చోమని బీజేపీ సీనియర్లు ఆజ్ఞా పించారు. దీనిపై సభలో గురువారం వివరణ ఇస్తానని సాధ్వి మీడియాకు తెలిపారు. గతంలోనూ గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా కీర్తించిన ఆమెకు ప్రధాని మోడీ వార్నింగ్ కూడా ఇచ్చారు.

Latest Updates