మత్స్యకారుల కోసం ‘సాగర్ మిత్ర’ పథకం

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2020-2021 సంవత్సర కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్‌కు ఇది రెండవసారి. 2020బడ్జెట్‌పై దేశం మొత్తం భారీ అంచానాలను పెట్టుకుంది. ప్రజల ఆదాయం పెంచె దిశగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఇది సామాన్యుల బడ్జెట్‌గా ఆమె అభివర్ణించారు. మత్స్యకారుల కోసం కొత్తగా ‘సాగర్ మిత్ర’ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘దీని ద్వారా యువతకు చేపలు పట్టడంలో శిక్షణ ఇస్తాం. చేపల ఉత్పత్తిని 2 లక్షల టన్నులకు పెంచడమే ఈ పథక లక్ష్యం’ అని ఆమె అన్నారు.

Latest Updates