అచేతన చిన్నారులకు ఆసరా.. సహారా

సామాజిక అభివృద్ధిసంస్థ అయిన సహారా అచేతన చిన్నారులకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంటోంది. పుట్టుకతో దివ్యాంగులైన ఎందరో పిల్లలు ఆర్థికస మస్యలతో చికిత్సకు దూరమవుతున్నారు. అలాంటి వారిని గుర్తించి, వారి ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తోంది . ఇందుకోసం ప్రైమరీ రీ-హాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది . ఒక్కోసెంటర్ లో 20 నుం చి 30 మందికి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. సెంటర్లలో దివ్యాంగుల ట్రీట్ మెంట్ కోసం 24 మంది కేర్ టేకర్లు, ఇద్దరు ఫిజియోథెరపిస్టులు, నలుగురు స్పెషల్ ఎడ్యుకేటర్లు సేవలందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఉచిత ఆటోలను అందుబాటులో ఉంచారు. అలాగే హైదరాబాద్ లోనియూసుఫ్ గూడలోని చిల్డ్రన్ హోమ్ లోనూ ప్రభుత్వ సహకారంతో సహార రిహాబిలిటేషన్ సెంటర్ సేవలు కొనసాగుతున్నాయి. ఇక్కడి హోమ్ లో65 మంది దివ్యాంగులు ఉన్నారు. వారందరి బాగోగులు చూస్తోంది . ప్రధానంగా ఆటిజం,వినికిడి, డిజెబుల్, బ్లైండ్ తదితర లోపం ఉన్నబాలబాలికలు ఈ సెంటర్ లో ఉన్నారు. ఇప్పటివరకు ఇందులోని 25 మంది పిల్లలు శారీరకంగా ఎదిగేందుకు ఫిజియోథెరపి తోడ్పడిందని నిర్వాహకులు తెలిపారు.

తల్లిదండ్రుల కష్టాలకు చలించి…

మెదక్ జిల్లా నారాయణఖేడ్ కు చెందిన శంకర్ఫిజియోథెరపిస్టు . ఆయన సంగారెడ్డిలోని డిస్ట్రిక్ఎర్లీ ఇంటర్ వెన్షన్ లో ఫిజియోథెరపిస్టుగా పనిచేసేవారు. అక్కడికి వచ్చే పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలను చూసిచలించిపోయాడు. ఆ సమయంలో అలాంటి వారికి ఏదైనా సాయం చేయాలని భావించి తన స్నేహితుడు అభిలాష్ సహకారంతో ‘సహారా’ సొసైటీని 2016లోస్థాపించాడు. తొలుత శంకర్ తమ సొసైటీద్వారా సంగారెడ్డి జిల్లాలోని దివ్యాంగులపై సర్వేచేయించారు. 40 శాతం కంటే తక్కువ లోపం ఉన్న దివ్యాంగులను ప్రభుత్వం గుర్తించకపోవడాన్ని తెలుసుకున్నారు. ఈ సమస్యను 2016లోఅప్పటి కలెక్టర్ రోనాల్డ్​రోస్ దృష్టికి తీసుకెళ్లి దివ్యాంగులకు చికిత్స ఇప్పించేందుకు జిల్లాలోని200 మంది మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అయితే సమస్య కొంత వరకు తీరినా పూర్తిస్థాయిలో ఫలితం రాలేదని శంకర్ గ్రహించారు.

ఫ్రీగా ఇప్పించాలని తలచి…

అనంతరం సహారా సొసైటీ తరఫునే ఉచితంగా ట్రీట్ మెంట్ అందించాలని శంకర్ భావించారు. ఇందుకోసం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్ చెరు, సంగారెడ్డి, జోగీపేట్, కొండా పూర్, మహబూబ్ నగర్జిల్లాలోని జానంపేట్, నవాబ్ పేట్, బానువాడ, కోమల్ కొండ, అనుగొండ, హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ చిల్డ్రన్ హోమ్ ఇలా మొత్తం12ప్రైమరీ రీహాబిలిటి సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా సెంటర్లలో దివ్యాంగులకు కేర్ టేకర్లు, ఫిజియోథెరపిస్టులతో చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం చొరవ చూపి అవసరమున్నచోట రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సహారా వ్యవస్థాపకుడు శంకర్ అంటున్నారు.

వైకల్యాన్ని తగ్గించేందుకు…

నా దగ్గరరకు వచ్చిన చాలా మంది చిన్నారుల్లో ఎదుగుదల తక్కువగా కనిపించేది. మానసిక, శారీరక వైకల్యం ఉన్న పిల్లలే అధికంగా ఉండేటోళ్లు . గ్రామీణ ప్రాంతాల్లో వారికి చికిత్స చేసే కేంద్రాలు లేకపోవడంతో హైదరాబాద్, పట్టణ ప్రాంతాలకు వెళుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లికి శిక్షణ ఇస్తే కొంత మార్పు తేవచ్చనే ఆలోచనవచ్చింది. వెంటనే ‘మాతృపున్న వికాస కార్యకర్త మారా’ అనే కార్యక్రమం ద్వారా 200మంది తల్లులకు పైగా శిక్షణ ఇచ్చాం. ఆ సక్సెస్ తోనే ‘సహారా’ ప్రైమరీ రీహాబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశాం.

Latest Updates