‘రన్ రాజా రన్’ స్టోరీనే ‘సాహో’గా తీశా

‘సాహో’ సినిమాను హాలీవుడ్ సినిమా ‘లార్గో వించ్’ నుంచి కాపీకొట్టారని ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సాల్ చేసిన ఆరోపణలపై సాహో దర్శకుడు సుజిత్ స్పందించాడు. తాను ఆ సినిమాను చూడలేదని చెప్పాడు. చూడని సినిమాను కాపీ కొట్టారనడం సరికాదని.. ఆరోపణలు చేసినవారు సాహోను సరిగ్గా చూసి ఉండరని అన్నారు. అయితే ‘రన్ రాజా రన్’ సినిమా స్టోరీనే కాస్త మార్పులు చేసి సాహో ను తయారు చేశానని చెప్పాడు సుజిత్.

తన సొంత స్థలానికి దూరంగా ఉంటున్న హీరో… తన తండ్రి వారసుడిని నేనే అని నిరూపించుకున్నాడనేది లార్గో వించ్ మెయిన్ ప్లాట్ అని చెప్పాడు సుజిత్. అయితే సాహో స్టోరి అది కాదని హీరో తండ్రి చనిపోయే సినిమాలన్ని లార్గో వించ్ నుంచి కాపీ కొట్టినవి ఎలా అవుతాయని అన్నాడు డైరెక్టర్ సుజిత్.

Latest Updates