గ్రీన్ ఇండియా చాలెంజ్… మొక్కలు నాటిన సాయిపల్లవి

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా దక్షిణాది హీరోయిన్ సాయిపల్లవి మొక్కలు నాటారు. తనను గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగం చేసినందుకు హీరో వరుణ్ తేజ్ కు సాయి పల్లవి థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుత కాలంలో… ప్రకృతిలో సహజమైన గాలి దొరకడం కష్టంగా ఉందని… దాన్ని ఎదుర్కోవడానికి ప్రతీఒక్కరు మొక్కలను నాటాలని తెలిపింది. తనవంతుగా ఒక మొక్కను నాటానని.. తను సమంతను, రాణా దగ్గుబాటిని మొక్కలు నాటడానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ కు నామినేట్ చేస్తున్నానని ట్వీట్ చేసింది.

Latest Updates