శేఖర్ కమ్ముల-చైతు మూవీ ప్రారంభం

హైదరాబాద్ : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా నటించనున్న సినిమా ప్రారంభమైంది. చైతు సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ గురువారం సికింద్రాబాద్‌లోని వినాయకుడి ఆలయంలో పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు ‘ఫిదా’ సినిమాతో మంచి విజయం అందుకున్న శేఖర్‌ కమ్ముల .. తర్వాత ఎలాంటి స్టోరీతో  వస్తారా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ‘ఫిదా’ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవినే మళ్లీ తన సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ చేయడంతో మూవీపై ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.

నారాయణదాస్‌ నారంగ్‌, రామ్మోహనరావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ మొదలైంది. సెప్టెంబర్‌ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటిగ్ ప్రారంభం అవుతుంది. 2019 క్లైమాక్స్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది సినిమా యూనిట్.

 

Latest Updates