విజయవాడ సమీపంలో సాయిబాబా విగ్రహం ధ్వంసం

విజయవాడ: కృష్ణా జిల్లా రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం తలుపులు మూసివేశాక…  అర్థరాత్రి సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. షిర్డీ సాయిబాబా మందిరం ఆవరణలో బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఓ వైపు ఆలయాల్లో ఘటనలపై ఆందోళనలతో అట్టుడుకుతున్న నేపధ్యంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. స్థానికుల ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

 

Latest Updates