గుండెపోటుతో సైదాబాద్ తహసీల్దార్ మృతి

Saidabad MRO anasurya died because of Heart attack

మలక్ పేట, వెలుగు: గుండెపోటుతో సైదాబాద్ మండల నాయబ్‌ తహసీల్దార్ అనసూర్య మృతి చెందారు. కొత్తపేట ఆర్ కే పురంలోని తన నివాసంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఆమె గుండెనొప్పి తో ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్ కు తరలించగా మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బదిలీ పై ఏడాదిగా సైదాబాద్‌ తహసీల్దార్ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె మృతదేహానికి ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ ఆర్ పీ జ్యోతి, వీఆర్ వో విజయ్ రావు, సిబ్బంది నివాళులర్పించారు.

Latest Updates