జాతీయ చాంపియన్‌షిప్‌లో సైనా, సింధు

స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఆడనున్నారు. ఈనెల 12 నుంచి గౌహతి వేదికగా జాతీయ టోర్నీ జరగనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-50లో ఉన్న భారత టాప్‌-8 షట్లర్లు సింగిల్స్‌ బరిలో ఉండగా.. డబుల్స్‌ నుంచి టాప్‌-50లో ఉన్న టాప్‌ ఫోర్‌ జోడీలు పోటీపడుతున్నాయి. మహిళల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సైనా, గతేడాది రన్నరప్‌ సింధు టోర్నీకి అట్రాక్షన్‌గా నిలవనున్నారు.

పురుషుల సింగిల్స్‌లో నిరుటి విజేత హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, రన్నరప్‌ కిడాంబి శ్రీకాంత్‌ గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యే అవకాశముంది. దీంతో మాజీ విన్నర్స్ సమీర్‌ వర్మ, పారుపల్లి కశ్యప్‌, యువ సంచలనం లక్ష్యసేన్‌ ఫేవరెట్లుగా పోటీపడనున్నారు.

Latest Updates