వరంగల్ లో సాయిపల్లవిని గుర్తుపట్టలేదు

అందరిలో కలిసిపోయి.. సినీ తారలకు ఉండే క్రేజ్ సామాన్యమైనది కాదు. వాళ్లని కలవాలని, మాట్లాడాలని, ఒక్క ఫొటో తీయించు కోవాలని తహతహలాడుతుంటారు ఫ్యాన్స్. పొరపాటున ఎక్కడైనా కనిపిస్తే కనీసం సెల్ఫీ అయినా తీసుకోవాలని ఆరాటపడుతుంటారు. అలాంటిది సాయిపల్లవి ఓ మామూలు అమ్మాయిలా అందరి మధ్యతిరుగుతున్నా కనీసం ఎవ్వరూ గుర్తు కూడా పట్టలేదు. ప్రస్తుతం సాయిపల్లవి రానాతో కలిసి ‘విరాటపర్వం ’లో నటిస్తోంది. వేణు ఊడుగుల డైరెక్షన్‌ లో తెరకెక్కు తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల వరంగల్‌‌లో జరిగింది. సాయి పల్లవిబస్టాప్‌ కి వచ్చి కూర్చోవడం, బస్ వచ్చాక ఎక్కి వెళ్లిపోవడం వంటి సన్ని వేశాలను చిత్రీకరించారు. ఆ క్రమంలో ఆమె వచ్చి బస్టాప్‌ లో ఉన్న బెంచి మీద కూర్చుంది.కాసేపటి తర్వాత బస్ రాగానే మిగతా ప్రయాణికులతో పాటు ఎక్కింది.రహస్యంగా పెట్టిన కెమెరాతో ఇదంతా షూట్ చేశారు. అయితే చుట్టూ ఉన్నవాళ్లెవరూ సాయిపల్లవిని గుర్తించలేదు. ఎవరో ఒక వ్యక్తి మాత్రం గుర్తుపట్టిమొబైల్‌‌తో షూట్ తీసి నెట్‌‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతోవిషయం బైటికొచ్చింది. కనీసం ఎవరూ గుర్తు పట్టలేదంటే సాయి పల్లవి తనపాత్రకి తగ్గట్టుగా మారిపోయిందన్నమాట. ఇంత నేచురల్‌‌గా తీస్తున్నారంటే సినిమా పైన మంచి అంచనాలే ఏర్పడతాయి.

Latest Updates