రివ్యూ: సైరా నరసింహా రెడ్డి

రన్ టైమ్: 2 గంటల 50 నిమిషాలు

నటీనటులు: చిరంజీవి,అమితాబ్ బచ్చన్,తమన్నా,నయనతార,విజయ్ సేతుపతి,కిచ్చా సుదీప్,జగపతిబాబు,రవికిషన్,పవిత్రా లోకేష్,రణదీర్ రెడ్డి తదితరులు.

సినిమాటోగ్రఫీ: రత్నవేలు

మ్యూజిక్: అమిత్ త్రివేది

ఆర్ట్ : రాజీవన్

రచన: పరచూరి బ్రదర్స్

డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా

నిర్మాత : రాంచరణ్

స్క్రీన్ ప్లే,దర్శకత్వం: సురేందర్ రెడ్డి

రిలీజ్ డేట్: అక్టోబర్ 2,2019

కథేంటి?

18 వ శతాబ్దంలో బ్రిటీష్ వాళ్లను ఎదిరించిన రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘‘సైరా’’.. అప్పటి
కాలంలో ఆయన ఇంగ్లీష్ వాళ్లతో ఎలా పోరాడాడు?ప్రజల్ని చైతన్యవంతులను చేసి ఉద్యమాన్ని ఎలా నడిపించాడు అనే కథకు కొన్ని కల్పితాలు సృష్టించి కమర్షియల్ గా తీసిన బయోపిక్ ఈ సైరా.

నటీనటుల పర్ఫార్మెన్స్:

చిరంజీవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సైరా నరసింహా రెడ్డి పాత్రలో ఒదిగిపోయి నటించాడు.ఎమోషనల్ సీన్లల్లో,ప్రజలను ఇన్స్ పైర్ చేసే సీన్లల్లో అధ్బుతమైన నటన కనబరిచాడు.ఈ ఏజ్ లో ఓ స్వాతంత్ర్య పోరాట యోధుడిగా నటించడం అంటే మాములు విషయం కాదు.యాక్షన్ సీన్లల్లో ఏ మాత్రం తగ్గకుండా ఎనర్జిటిక్ గా కనిపించాడు.గురువు పాత్రలో అమితాబ్ మెప్పించారు.తమన్నాకు తన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర దక్కింది.నరసింహారెడ్డి భార్య పాత్రలో నయనతార ఆకట్టుకుంటుంది. ఇంపార్టెంట్ పాత్రలలో సుదీప్,విజయ్ సేతుపతి,జగపతిబాబు రాణించారు.రవికిషన్,రణధీర్,బ్రహ్మాజీలు కూడా బాగా చేశారు.

టెక్నికల్ వర్క్:

మూవీ టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంది.. ముఖ్యంగా రత్నవేలు సినిమాటోగ్రఫీ అధ్బుతం.అమిత్ త్రివేది ఒక్క టైటిల్ సాంగ్ తోనే స్కోర్ చేశాడు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుండాల్సింది.రాజీవన్ ఆర్ట్ వర్క్ సూపర్బ్.18వ శతాబ్దపు కాలన్ని క్రియేట్ చేశాడు..యాక్షన్ సీన్లు హై స్టాండర్డ్ లో ఉన్నాయి.గ్రాఫిక్స్ వర్క్ ఉన్నంతలో నీట్ గా ఉంది.ఎక్కడా వంక పెట్టలేం.కాస్త లెంగ్త్ ఎక్కువైన ఫీల్ కలుగుతుంది.నిర్మాత రామ్ చరణ్ ఎక్కడ రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు.ప్రతీ పైసా స్క్రీన్ పై కనిపిస్తుంది.సాయి మాధవ్ బుర్రా డైలాగులు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

‘‘సైరా’’ బయోపిక్ కాదు.కొన్ని ఆధారాలకు కొన్ని కల్పితాలు జతచేసి కమర్షియల్ గా ఈ సినిమాను తీసారు.ఎలివేషన్ లు,ఎమోషనల్ సీన్లు రాసుకొని ఆడియన్స్ కు ఓ పక్కా కమర్షియల్ సినిమాను అందించారు.సురేందర్ రెడ్డి మార్క్ టేకింగ్,టెక్నికల్ టీమ్ సపోర్ట్,నటీనటుల ప్రతిభ అన్నీ తోడై సక్సెస్ అయింది.మొదలయిన 30 నిమిషాల వరకు సోసో గా సాగినా.. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉండటంతో ఫస్టాఫ్ బాగుందనిపిస్తుంది.అక్కడ లేచిన సినిమా పేస్ తర్వాత కూడా కంటిన్యూ అయింది.తన కోటపై దాడికి వచ్చిన బ్రిటీషర్లను ఎదుర్కునే ఎపిసోడ్,వార్ ఎపిసోడ్,క్లైమాక్స్ అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి.చివర్లో దేశం గురించి,స్వాతంత్ర్య పోరాటం గురించి చెప్పిన డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి.తద్వారా బయటకు వచ్చే ప్రేక్షకుడు సాటిస్ ఫై అవుతాడు.చరిత్ర మరిచిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గొప్పదనం ఈ సినిమా ద్వారా తెలుస్తుంది.ఆ పాత్రలో మెప్పించిన చిరంజీవి అభినందనీయుడు. సెకండాఫ్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రతిభ కనిపిస్తుంది.ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.చిరంజీవి ఫ్యాన్స్ కు ఈ సినిమా పండగ లా ఉంటుంది.తమ హీరోను ఇలాంటి గొప్ప పాత్రలో చూడటం వాళ్లను సాటిస్ ఫై చేస్తుంది కాగా ఆడియన్స్ ను కూడా ఈ చిత్రం మెప్పిస్తుంది.

Latest Updates