చిరంజీవి నామాటల్ని పట్టించుకోడు: అమితాబ్ బచ్చన్

‘సైరా’ ప్రమోషన్ లో సినీ టీం బిజీగా గడుపుతుంది. ఇందులో భాగంగా.. సైరా హీరో చిరంజీవి  ముంబైకు వెళ్లి అమితాబచ్చన్ ను కలిశారు. హిందీలో కొణిదెల ప్రొడక్షన్‌తో కలిసి ఫరాన్ అక్తర్, రితేష్ సిద్వానీ, సైరా సినిమాను ప్రెసెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా… ఫరాన్ అక్తర్, చిరంజీవి, అమితాబ్ కలిసి చిట్ చాట్ చేశారు.

తనకు చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి అమితాబ్ మాట్లాడుతూ… ఊటీలో తన షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవికూడా అక్కడే వేరే సినిమా షూటింగ్ పాల్గొన్నాడని.. అప్పుడే తాము కలుసుకున్నామని అన్నారు. అప్పటికే కొందరు తనకు చిరంజీవి గురించి చెప్పారని.. ఆయన మంచి డ్యాన్సర్ అని అన్నారు. తాను చిరంజీవికి చాలా సలహాలు ఇస్తానని అయితే ఆయన అవి పాటించరని చెప్పారు. చిరును రాజకీయాల్లోకి వెళ్లవద్దని చెప్పానని అయితే తన మాటను పట్టించుకోకుండా వెళ్లారని అమితాబ్ అన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ… సైరా సినిమాలో తన గురువు పాత్ర పోషించినందుకు అమితాబ్ కు థ్యాంక్స్ తెలిపారు. మొదట తన గురువు పాత్ర ఎవరు పోషిస్తున్నారో తెలియదని… అదే విషయాన్ని దైరెక్టర్ సురేందర్ రెడ్డిని ప్రశ్నించగా బిగ్  బీ నటిస్తే బాగుంటుందని అన్నారని తెలిపారు. అప్పుడే తాను అమితాబ్ కు ఫోన్ చేసిఅడిగానని.. తాను ఒప్పుకోవడం నిజంగా సంతోషమని చెప్పారు. కొణిదెల ప్రోడక్షన్ లో నిర్మించిన సైరా చిత్రం అక్టోబర్ 2వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, సుధీప్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు.

Latest Updates