సలార్‌గా రఫ్ఫాడించనున్న ప్రభాస్.. జనవరిలో షూట్ స్టార్ట్

హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ మరో భారీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ముందుగా ఊహించినట్లగానే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌‌తో సినిమాను ప్రకటించాడు. సలార్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను కేజీఎఫ్‌‌ను నిర్మించిన హొంబలే ఫిల్మ్స్ రూపొందించనుంది. హై యాక్షన్ ఫిల్మ్‌‌గా సలార్ తెరకెక్కనుంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పెద్ద మీసాలతో, గన్ పై చేయి పెట్టి కూర్చున్న ఈ లుక్‌‌కు నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అత్యంత క్రూరమైన మనిషి, వన్ మ్యాన్ అంటూ ఈ పోస్టర్‌‌కు క్యాప్షన్‌‌ను జత చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ప్రభాస్ తెలిపాడు. ఇది ఏ ఒక్క భాషా చిత్రమో కాదని, పూర్తి ఇండియన్ సినిమా అంటూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌‌తోపాటు ప్రభాస్ ట్వీట్ చేశారు.

Latest Updates