ఔట్​సోర్సింగ్ సిబ్బందికి ఐదు నెలలుగా అందని జీతాలు

హైదరాబాద్​, వెలుగు:ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. ఐదు నెలలుగా వారికి సర్కారు జీతాలివ్వకపోవడంతో 80 వేల మంది గోస తీస్తున్నారు. నిధులు లేవన్న కారణంతో ₹150 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేయట్లేదని తెలుస్తోంది. జీతాలు రాక తాము అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఉద్యోగులు బాధపడుతున్నారు. రాష్ట్రంలో మున్సిపల్​, హెల్త్​, పంచాయతీరాజ్​ వంటి శాఖల్లోనే ఎక్కువగా ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులున్నారు. రెవెన్యూ శాఖలో పనిచేసే సిబ్బందికైతే ఎనిమిది నెలలుగా జీతాలు రావట్లేదని తెలుస్తోంది. ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకు జీతాలు రాకపోవడంతో వాళ్ల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్​ అన్నారు. ప్రభుత్వం వెంటనే జీతాలిచ్చి ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. నిధుల కొరత పేరిట జీతాలు నిలిపేయడం సరైంది కాదన్నారు.

Latest Updates