రెండు విడతలుగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు వేతనాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సాలరీలను రెండు విడతల్లో చెల్లిస్తామని ఆ రాష్ట్ర సీఎం జగన్‌ చెప్పినట్లు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. సీఎంతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ఈ నెలలో సగం జీతం చెల్లిస్తామని… నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని ఆయన అన్నారు. ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా సాలరీ తీసుకునేందుకు ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని… ఆ తర్వాత నుంచి యథావిథిగా మొత్తం ఒకే సారి ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారన్నారు.

Latest Updates