రెన్యూ పవర్ ఉద్యోగులకు జీతాల పెంపు

బోనస్‌‌లు కూడా.. 

న్యూఢిల్లీ: రెన్యూ పవర్ తన ఉద్యోగులందరికీ 12 శాతం వరకు జీతాల పెంపును, బోనస్‌లను అందించినట్టు వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో చాలా కంపెనీలు వేతన కోతలను ప్రకటిస్తోన్నఈ సమయంలో రెన్యూ పవర్ ఈ నిరయ్ణం తీసుకోవడం విశేషం. క్లీన్ క్లీ ఎనర్జీలో ఉన్న కొన్ని సంస్థలు ఇప్పటికే ఉద్యోగులకు వేతన పెంపులను  ప్రకటించాయి. కానీ తమంతలేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 2020 ప్రతి ఒక్కరికీ ఛాలెంజింగ్ ఏడాదని, రెన్యూ పవర్స్ కూడా ప్రతికూల సమస్యలను ఎదుర్కొందని, కానీ ఆపరేషన్స్ కంటిన్యూగా కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కష్ట సమయాల్లో కూడా జీతాల పెంపు , బోనస్‌లను ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించినట్టు రెన్యూ పవర్ ఎండీ, ఛైర్మన్ సుమంత్ సిన్హా తెలిపారు. ఎకానమీలో ఉన్నచాలా రంగాలు మెల్లగా రికవరీ అవుతున్నాయని, త్వరలోనే ఇండియా గ్రోత్ మళ్లీ పట్టాలెక్కుతుందని పేర్కొన్నారు. ఇండియాలో లీడింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీగా రెన్యూ పవర్ ఉంది. పలు లొకేషన్స్‌‌లో ఉన్న 1,100కి పైగా ఉద్యోగులకు ఈ వేతన ఇంక్రిమెంట్‌‌ను ఇస్తోంది. వేతన ఇంక్రిమెంట్ 5 శాతం నుంచి 12 శాతంగా ఉన్నట్టు సిన్హా చెప్పారు.

 

Latest Updates