జీతం డబ్బు CMRFకు ఇచ్చిన శానిటేషన్ కార్మికురాలు

హైదరాబాద్, వెలుగు : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తనవంతు డ్యూటీ చేస్తున్న జీహెచ్ఎంసీ శానిటేషన్ కార్మికురాలు అలివేలు పెద్ద మనస్సు చాటుకుంది. తన జీతం రూ.12 వేలల్లో 10వేలను సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇచ్చింది. మంగళవారం మేయర్ రామ్మోహన్ తో కలిసి ప్రగతి భవన్లో మినిస్టర్ కేటీఆర్ కి చెక్కు అందించింది. ఏదైనా సాయం కావాలంటే అడగాలని మంత్రి సూచించగా, తాను ప్రయోజనం ఆశించి విరాళం ఇవ్వలేదని చెప్పిన అలివేలును కేటీఆర్అభినందించారు.

Latest Updates