సింగరేణిపై బకాయిల బండ

తెలంగాణ జెన్కో, ట్రాన్స్ కో నుంచి రావాల్సిన
మొత్తం 8 వేల కోట్ల కు పైమాటే

రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థసింగరేణి క్రమంగా ఆర్థిక‌ సంక్షోభంలో కూరుకపోతోంది. రెండు దశాబ్దాలుగా లాభాలు తప్ప నష్టాలు ఎరగని ఈ కంపెనీపై కొన్నేళ్లుగా బకాయిల భారం పెరిగిపోతోంది. తెలంగాణ జెన్కో, ట్రాన్స్ కో నుంచి ఏకంగా 8వేల కోట్లకు పైగా రావాల్సి ఉన్నా, రాష్ట్రప్రభుత్వం పట్టించుకోక పోవడంతో రెండేండ్లుగా సంస్థ ఆర్థిక‌ పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు కరోనా లాక్డౌన్ కారణంగా సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గుకు డిమాండ్ పడిపోయింది. దీంతో కొద్ది నెలలుగా తన ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి కూడా సంస్థ యాజమాన్యం దిక్కులు చూస్తోంది. తనకు ఉన్న ఒకే ఒక పవర్ ప్లాంట్ ను షట్ డౌన్ చేసిన సింగరేణి, రోజువారీ ఆర్థిక‌ అవసరాలు తీర్చుకోలేక సతమతమవుతోంది.

పేరుకుపోతున్న బకాయిలు..

సింగరేణి ఏటా 60 మిలియన్ల ట‌న్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేసి, ఎన్టీపీన్టీ సీతో పాటు వివిధ రాష్ట్రాల్లోని థర్మల్ పవర్ స్టేషన్స్ కు సప్లై చేస్తోంది. ఇందులో 17 నుంచి 20 మిలియన్ టన్నుల కోల్ ను కేవలం తెలంగాణ జెన్కో కే అందిస్తోంది. తాను కూడా సొంతంగా జైపూర్ పవర్ ప్లాంట్ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసి రాష్ట్ర గ్రిడ్కు సరఫరా చేస్తోంది. సంస్థ నుంచి బొగ్గు కొనుగోళ్ల‌కు సంబంధించి తెలంగాణ జెన్కో నుంచి రూ.2,800 కోట్లు, పవర్ కొనుగోళ్ల‌కు సంబంధించి తెలంగాణ ట్రాన్స్ కో నుంచి రూ.5600 కోట్లు సింగరేణికి రావాల్సి ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇక ఏపీ జెన్కో రూ.600 కోట్లు బకాయి పడింది. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి ఏకంగా రూ.వెయ్యి కోట్లకు పైగా రావాల్సి ఉంది. సింగరేణి బొగ్గుపై ఆధారపడి సౌత్ ఇండియాలో 4వేల కుపైగా చిన్న, పెద్ద ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. మొత్తంగా సంస్థకు రూ.12వేల కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని ఆఫీసర్లు అంటున్నారు. అదే టైంలో జైపూర్లోని సింగరేణి థర్మల్ ప‌వ‌ర్ ప్లాంట్ లో కొత్త యూనిట్ల ఏర్పాటు కోసం సంస్థ ఏకంగా రూ.800 కోట్ల అప్పు చేసింది. ఇందుకోసం 12శాతం వడ్డీ కడుతోంది.

చెల్లించే పన్నులు మాత్రం యథాతథం..

బకాయిల పరిస్థితి ఇలా ఉంటే సింగరేణి నుంచి రావాల్సిన పన్నులను మాత్రం ఫైనాన్షియ‌ల్ ఇయర్ రాకముందే ప్రభుత్వాలు రాబట్టుకుంటున్నాయి. పన్నులు, డివెడెంట్లు, రాయల్టీల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సింగరేణి ప్రతి ఏటా రూ.7 వేల కోట్లకు పైగా చెల్లిస్తోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర సర్కారుకు రూ.13,105 కోట్లు, కేంద్ర ప్రభుత్వానికి రూ.14,362 కోట్లు చెల్లించింది. ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ది కోసం ‘డిస్ర్టి క్ట్ మినిరల్ ఫండ్ ట్రస్టు’కింద మూడేళ్లకా లంలో రూ .1,84 4 కోట్లను సింగరేణి చెల్లించింది. కోల్ బెల్ట్ ప‌రిధిలోని ఎమ్మెల్యేలకు ఏటా రూ.2 కోట్లనిధులు అందజేస్తోంది. తాజాగా సీఎం సహాయనిధికి రూ.40కోట్ల విరాళం అందించింది.

వేతనాలకూ కటకటే..

సింగరేణి సంస్థతన కార్మికులు, ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు ప్రతినెలా రూ.250 కోట్లు అవసరం. పన్నులు, లెవీలు, కోల్ తవ్వకాలకు అవసరమయ్యే ముడి సరుకులకు, యంత్రాలు సరఫరా చేసే సంస్థలకు, ఓపెన్ కాస్టు గనుల్లో ఓబీ పనులు చేసే కాంట్రాక్ట‌ర్ల‌కు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాలి. కానీ ఆర్థిక‌ ఇబ్బందుల నేపథ్యంలో తాజాగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. లాక్ గౌన్ నేపథ్యం లో మార్చి నెలలో ఉద్యోగులకు సగం వేతనాలు మాత్రమే చెల్లించారు. మిగిలిన వేతనాలను ఏరియర్స్ రూపంలో రూ.125 కోట్లమేర కార్మికులు, ఉద్యోగుల ఖాతాల్లో వేయాల్సి ఉంది. కానీ ఈ మొత్తం ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో లేదో చెప్పడం లేదు. అదీగాక సింగరేణి వ్యాప్తంగా ప్రతినెలా సుమారు 300 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వీరికి గతేడాది ఏప్రిల్ నుంచి గ్రాట్యూటీతో పాటు ఇతర ప్రయోజనాలు ఇవ్వడంలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates