రూ. 50 వేలు ఫైన్ : బిగ్​బజార్ లో ఎక్స్ పైర్డ్ ప్రొడక్ట్స్ అమ్మకం

కుత్బుల్లాపూర్,వెలుగు: డేట్ ఎక్స్ పైర్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను అమ్ముతున్న కొంపల్లి బిగ్ బజార్ కి మున్సిపల్ అధికారులు రూ.50 వేలు ఫైన్ విధించారు. వివరాల్లోకి వెళితే..కొంపల్లి బిగ్ బజార్ లో క్వాలిటీ లేని, డేట్ ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ప్రొడక్ట్స్ ని అమ్ముతున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు మంగళవారం మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు.

ప్రొడక్ట్స్ ని పరిశీలించి..జిల్లా ఫుడ్ ఇన్ స్పెక్టర్ కి సమాచారం ఇచ్చారు. బిగ్ బజార్ ఓనర్ కి రూ.50 వేల ఫైన్ విధిస్తూ కమిషనర్ జ్యోతి నోటీసులు పంపారు. ఈ ఫైన్ ను రెండు రోజుల్లో చెల్లించాలని లేకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులో
ఆమె  పేర్కొన్నారు.

Latest Updates