చిన్న టౌన్స్​లోనే తెగ కొంటున్నరు

కన్జూమర్ కంపెనీలకు గ్రోత్ అక్కడినుంచే
ప్రీ కరోనా స్థాయిలకు సేల్స్

ముంబై: చిన్న పట్టణాల ప్రజలే ఎక్కువగా కొంటున్నారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ , ఫ్యాషన్, డైలీ గ్రోసరీలు అమ్మే టాప్ కన్జూమర్ కంపెనీలన్నీ  చిన్న పట్టణాల నుంచే తమకు గ్రోత్ ఎక్కువగా నమోదవుతున్నట్టు చెబుతున్నాయి. డిమాండ్ కొన్ని పట్టణాల్లో ప్రీ కరోనా స్థాయిలపైనే రికార్డవుతున్నట్టు తెలిపాయి. సిటీల్లో మాత్రం కన్జంప్షన్ పెరగడం చాలా ఇబ్బందికరంగా మారిందని అంటున్నాయి. దేశంలో అతిపెద్ద రిటైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేరున్న రిలయన్స్ రిటైల్ తన ఫ్యాషన్ స్టోర్ చెయిన్ ట్రెండ్స్ జూలై–సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గతేడాదితో పోలిస్తే రెండింతలకు పైగా సేల్స్‌ పెంచుకుందని తెలిపింది. తమ మొత్తం  బిజినెస్‌‌‌‌‌‌‌‌ అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరోనా ముందటి స్థాయిలకు వస్తుందని భావిస్తున్నట్టు ఇన్వెస్టర్ ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌లో కంపెనీ చెప్పింది.

శాంసంగ్, ఎల్‌‌‌‌‌‌‌‌జీ, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ వంటి ఆరుకు పైగా కంపెనీలు తమకు సేల్స్ గ్రోత్ ఎక్కువగా చిన్న పట్టణాల నుంచే వస్తున్నట్టు తెలిపాయి. ఈ గ్రోత్ సిటీలను కూడా మించుతున్నట్టు చెప్పాయి. కరోనా ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్ రేటు ఇంకా ఎక్కువగానే ఉండటంతో మెట్రోల్లో షాపర్లు మాల్స్‌‌‌‌‌‌‌‌కు రావడానికి భయపడుతున్నారని కంపెనీలు చెబుతున్నాయి. దీంతో ఖర్చులను కూడా తగ్గించుకున్నట్టు పేర్కొన్నాయి. దేశంలో అతిపెద్ద అప్లియెన్స్ మేకర్ ఎల్‌‌‌‌‌‌‌‌జీ తమ రెవెన్యూల్లో సగం వరకు టైర్ 2, టైర్ 3 పట్టణాల నుంచే వస్తున్నట్టు తెలిపింది.  రుతుపవనాలు బాగుండటంతో అగ్రికల్చర్ అవుట్‌‌‌‌‌‌‌‌పుట్ పెరిగిందని, చిన్న పట్టణాల్లో కరోనా ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్షన్ రేటు తక్కువగా ఉందని ఎల్‌‌‌‌‌‌‌‌జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు అన్నారు. దీంతో ఈ మార్కెట్లలో కన్జూమర్ సెంటిమెంట్ మెరుగైందని పేర్కొన్నారు. కరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ ఆంక్షలతో పెద్ద పెద్ద నగరాల నుంచి సొంత పట్టణాలకు వెళ్లిన వైట్ కాలర్ వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌లో చాలా మంది ఇంకా వర్క్‌‌‌‌‌‌‌‌ ఫ్రమ్ హోమే చేస్తున్నారని చెప్పారు. దీంతో అక్కడ కొనుగోళ్లు పెరుగుతున్నాయని అన్నారు.

ప్రీమియం ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లకూ డిమాండ్…

ప్రీమియం ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లతో సహా అన్ని ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లకు చిన్న పట్టణాల్లో సేల్స్ గ్రోత్ ఉన్నట్టు శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్(కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్) రాజు పులాన్ చెప్పారు. మెట్రోలు, పెద్ద నగరాలతో పోలిస్తే చిన్న పట్టణాల్లోనే వీటి సేల్స్‌‌‌‌‌‌‌‌ మంచి గ్రోత్‌‌‌‌‌‌‌‌ను నమోదు చేస్తున్నట్టు తెలిపారు.  గతేడాదితో పోలిస్తే అక్టోబర్ నెలలో  కంపెనీ మొత్తం సేల్స్ గ్రోత్ 32 శాతంగా నమోదైందని చెప్పారు. ప్రీమియం ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ల గ్రోత్ 50 శాతంగా ఉన్నట్టు చెప్పారు.  అయితే చిన్న పట్టణాల్లో ఈ రేట్లు 36 శాతంగా, 68 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రీమియం ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు కూడా చిన్న మార్కెట్లలో 72 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ను రికార్డు చేశాయని, క్యూలెడ్ టీవీల సేల్స్ 46 శాతం పెరిగినట్టు తెలిపారు.

చాలామంది సొంతూర్లలోనే ఉన్నారు..

పెద్ద నగరాల్లో ఇంకా స్లోడౌన్‌‌‌‌‌‌‌‌ ఉండటానికి కారణం కరోనా కేసులు పెరుగుతుండటం, చాలా మంది ఇంకా సొంతూర్లలోనే ఉండటమని కంపెనీలు చెబుతున్నాయి.  సిటీలతో పోలిస్తే చిన్న పట్టణాల్లో ఆంక్షలు తక్కువగా ఉండటం, ఎకనమిక్ యాక్టివిటీస్‌‌‌‌‌‌‌‌పై అంత పెద్దగా ప్రభావం లేకపోవడం వంటివన్నీ సేల్స్ పెరగడానికి దోహదం చేస్తున్నట్టు తెలిపాయి.  ‘చిన్న పట్టణాల్లో ముఖ్యంగా స్టోర్లు ఎక్కువగా ఉండే వీధుల్లో కన్జూమర్ల రాక కరోనా ముందటి స్థాయిలకు చేరుకుంటోంది’ అని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశీష్ దీక్షిత్ ఇన్వెస్టర్ కాల్‌‌‌‌‌‌‌‌లో అన్నారు. వెస్ట్, సౌత్ ఇండియాలో మెక్‌‌‌‌‌‌‌‌డొనాల్డ్స్‌‌‌‌‌‌‌‌ను ఆపరేట్ చేసే వెస్ట్‌‌‌‌‌‌‌‌సైడ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కూడా చిన్న పట్టణాల్లో సేల్స్ గ్రోత్ కరోనా ముందటి స్థాయిల్లో 90–110 శాతం చేరుకున్నట్టు ప్రకటించింది.

రుతుపవనాల సాయం..

గతేడాది వరకు చిన్న పట్టణాల్లో ఈ  గ్రోత్ చాలా తక్కువగా ఉండేది. ఈసారి రుతుపవనాలు బాగుండటంతో పాటు ప్రభుత్వ పథకాలతో చిన్న పట్టణాల్లో గ్రోత్ రికవరీ అవుతోంది. ఇది ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తోంది. అన్ని కేటగిరీల్లో రూరల్ డిమాండ్ నమోదవుతోంది. కాంపిటేటివ్ అడ్వాన్‌‌‌‌‌‌‌‌టేజ్ పొందేందుకు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా రూరల్ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌ను కంపెనీలు చేపడుతున్నాయని మారికో మేనేజింగ్ డైరెక్టర్ సౌగత గుప్తా తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో ఖర్చు పెట్టలేని సంపద సవాలుగా మారినట్టు చెప్పారు.

Latest Updates