ఆకట్టుకుంటున్న సల్మాన్‌ ‘భారత్’ ట్రైలర్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా భారత్. ఈ మూవీ ట్రైలర్ సోమవారం రిలీజైంది. దేశానికి ఎప్పుడైతే స్వాతంత్ర్యం వచ్చిందో.. అప్పుడే నా కథ మొదలైంది అంటూ సల్మాన్‌ వాయిస్‌ ఓవర్‌ తో మొదలైన ట్రైలర్‌.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కార్మికుడిగా, నావీ ఆఫీసర్‌ గా ప్రతీ పాత్రలో సల్మాన్‌ యాక్టింగ్‌ అదిరిపోయేలా ఉంది. కత్రినా తన అభినయంతో ఆకట్టుకొంది. ప్రతి నవ్వు వెనకాల తెలియని బాధ ఉంటుందని సల్మాన్‌ చెప్పడంతో.. ట్రైలర్‌ లో కనిపించనిది ఇంకా ఏదో ఉందని అర్థమవుతోంది. సల్మాన్ సరసన కత్రినాకైఫ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రంజాన్‌ కానుకగా జూన్‌ 5న రిలీజ్ కానుంది.

Latest Updates