పుల్వామా: పాక్ సింగర్ ను సాగదోలిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సినిమాల్లో పనిచేస్తున్న పాకిస్తాన్ టెక్నిషియన్స్ ను తొలగిస్తున్నారు సినీ నిర్మాతలు. పుల్వామా దాడిని నిరసిస్తూ… ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. పాక్ కు చెందిన టెక్నిషియన్స్ ను భారతీయ సినిమాలలో అవకాశం ఇవ్వరాదంటూ నిర్ణయం తీసుకుంది. దీంతో బాలీవుడ్ నిర్మాతలు పాక్ కళాకారులను తమ సినిమాలనుండి తొలగిస్తున్నారు. సల్మాన్ ఖాన్ సొంత నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘నోట్ బుక్’ సినిమా నుండి పాకిస్తాన్ కు చెందిన సింగర్ అతీఫ్ అస్లమ్ ను తొలగించాడు. అతనికి బదులుగా.. అర్మాన్ మాలిక్ ను తీసుకున్నాడు.

మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ తన ‘టోటల్ ధమాల్’ సినిమాను.. పుల్వామా దాడికి నిరసనగా.. పాకిస్తాన్ లో విడుదల చేయడం లేదని తెలిపారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, క్రికెట్ ఆటగాళ్లు పుల్వామా దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు తోచినంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Latest Updates