25 వేల మంది సినీ కార్మికులకు సల్మాన్ ఆర్థికసాయం

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సినీ ఇండస్ట్రీలో పనిచేసే కళాకారుల పరిస్థితి దారుణంగా మారింది. సినిమా నిర్మాణాలు నిలిచిపోవడంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సహాయం అందించనున్నట్లు తెలిపాడు ప్రముఖ సినీ నటుడు సల్మాన్ ఖాన్ . తన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా సల్మాన్ హిందీ సినీ పరిశ్రమలో పని చేసే డైలీ  వర్కర్లందరికీ ఆర్థిక సహాయం అందించబోతున్నాడు. 25 వేల మంది కళాకారులకు సల్మాన్ నేరుగా అకౌంట్లలో డబ్బులు వేయనున్నాడు.

దీనికి సంబంధించి వారి అకౌంట్ల వివరాల లిస్టును సల్మాన్ తీసుకున్నాడు. లాక్ డౌన్ ఉన్నంత కాలం సినీ కార్మికులెవరూ తిండికి ఇతర అవసరాలకు బాధ పడాల్సిన పని లేదని.. వారిని ఆదుకుంటానని సల్మాన్ ప్రకటించాడు.

Latest Updates