స్ట్రెస్, టెన్షన్స్‌ ఫ్రీ చేసే టెక్నిక్‌.. సాల్ట్ థెరపీ

దగ్గు, జలుబు, సైనస్ వంటి డిసీజెస్​లకు సాల్ట్‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌

మెథడ్‌సిటీలో ఫస్ట్‌ టైం సాల్ట్ థెరపీ సెంటర్‌

హైదరాబాద్, వెలుగు: సముద్రపు ఉప్పు రూం లోకి వెళ్లి కళ్లు మూసుకుని గంట సేపు కూర్చుంటే చాలు టెన్షన్స్ అన్నిమర్చిపోయి రిలాక్స్ అవుతారు. ఒక్క స్ట్రెస్ నుంచి రిలీఫ్ మాత్రమే కాదు బ్రీతింగ్ ప్రాబ్లమ్, ఆస్తమా, సైనస్, జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. ఎందుకంటే అది “సాల్ట్ థెరపీ” స్పెషల్ రూమ్ కాబట్టి. సిటీ జనాలకు ఈ థెరపీ అందుబాటులో ఉంది.

సిటీలో ఫస్ట్‌ టైం

నగరానికి చెందిన మిథాలి సంఘీ ఎంబీఏ చదివారు. వెల్‌‌‌‌నెస్‌ అండ్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌ సెంటర్ ఓపెన్‌‌‌‌ చేయాలనే ఆలోచనతో ఓ రోజు సాల్ట్ థెరపీ గురించి న్యూస్‌లో చదివారు. అప్పటికే వెల్‌‌‌‌నెస్‌ సెంటర్ పెట్టాలనుకోవడంతో బెంగళూరులోని సాల్ట్ థెరపీసెంటర్‌ని సంప్రదించారు. సిటీలో ఇలాంటిది లేదని తెలుసుకుని అక్కడి సాల్ట్ థెరపీ ప్రతినిధులనుంచి పర్మిషన్ తీసుకుని ఫ్రాంచైజీని ప్రారంభించారు. థెరపీ సెంటర్ ఏర్పాటుకు ముందు 5 నెలలు సెర్చ్ చేశారు. టోటల్ సెటప్ చేయడానికి 6 నెలలు పట్టిందని నిర్వాహకురాలు మిథాలి సంఘీ చెప్పారు.

థెరపీ ఎలా ఉంటుందంటే..

చాలా థెరపీల గురించి వినే ఉంటారు. అయితే సాల్ట్ థెరపీ అనేది మాత్రం కొంచెం కొత్తదే. ఈ సాల్ట్ థెరపీ రూమ్ మొత్తం ఉప్పుతో ఉంటుంది.సముద్ర ఉప్పుతో గది గోడలను, ఫ్లోర్‌ని పూర్తిగా నింపేశారు. మధ్యలో 5 కుర్చీలు వేసి ఉంటాయి. గోడలకి వెంటిలేషన్ ఉండి కిటికీలు ఉంటాయి. ఈ థెరపీ తీసుకోవాలనుకునే వారు రెగ్యులర్ క్లాత్స్‌లోనే రావొచ్చు. లోపలికి వెళ్లాక చైర్‌లో కూర్చోవాలి. ఎయిర్ కండిషనర్ సిస్టమ్ ( హాలో జనరేటర్ అనే మిషన్) ద్వారా ఫార్మస్యూటికల్ గ్రేడ్ సాల్ట్స్ పార్టికల్స్ రూపంలో రూం అంతా వ్యాపిస్తాయి. చిన్న పిల్లలకు కోల్డ్ అయినప్పుడు సెలైన్‌లో,అలాగే సైనస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్లు తీసుకునే నాజిల్ స్ప్రేలోనూ సాల్ట్‌ని కలుపుతారు. ఒక్కో సెషన్స్ 55 నిమిషాలు ఉండి, ఒకేసారి ఐదుగురు సెషన్ తీసుకోవచ్చు. ఒక్కో సెషన్ అయిపోయాక అరగంట గ్యాప్ ఇస్తారు. వెంటిలేషన్, క్లీనింగ్ సిస్టమ్ ద్వారా క్లీన్ చేస్తారు. సెషన్ అయ్యాక రిలీజ్ అయిన బ్యాక్టీరియా బయటకు వెళ్లేందుకు వెంటిలేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ థెరపీ కోసం జలుబు, దగ్గు, ఆస్తమా, బ్రీతింగ్ ప్రాబ్లమ్, సైనస్ ఉన్న వారు మాత్రమే కాకుండా స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు కూడా వస్తుంటారు. ఇంకొంత మంది డీటాక్స్, స్కిన్ కండిషన్స్ మెరుగయ్యేందుకు వచ్చి థెరపీ తీసుకుంటుంటారు. ముఖ్యంగా అలర్జిటిక్ పేషెంట్స్‌కి ఈ సెషన్ ఉపయోగపడుతుంది. ఫార్మస్యూటికల్ గ్రేడ్ సాల్ట్‌ని పీల్చుతున్నప్పుడు అది ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుందని, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని నిర్వాహకులు మిథాలి సంఘీ తెలిపారు.

ఏ వయస్సు వారైనారావొచ్చు

ఆరు నెలల చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరూ రావచ్చు. మాములు పేషెంట్స్‌తో పాటు గర్భిణులు కూడా వస్తున్నారు. వారికి ఫీవర్, కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతారు. సెషన్స్ వైజ్‌ ఫీజు రూ.400 నుంచి రూ.600 వరకు ఉంటుంది. రెస్పాన్స్ బాగుంది. – మిథాలి సంఘీ,సాల్ట్ థెరపీ సెంటర్ నిర్వాహకురాలు

For More News..

అమ్మాయిలతో కలిసి ‘రొమాంటిక్’ స్కామ్

నిరుద్యోగులతో లైబ్రరీలు ఫుల్

వరల్డ్ రికార్డ్: 75 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా..

Latest Updates