ఈ పరికరంతో మంచి నీళ్లుగా మారనున్న ఉప్పునీళ్లు

రాజేశ్ సరాఫ్, ఉదయ్ నదివాడేలది హైదరాబాద్. చిన్నప్పట్నుంచి స్నేహితులు.ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేసి కొంతకాలం మ్యానుఫాక్చరింగ్ రంగంలో పని చేశారు.వివిధ కొత్త ఉత్పత్తులకు రూపకల్పన చేసేవాళ్లు. ఉద్యోగాలు చేస్తున్న సమయంలోనే సొంతంగా ఏదైనా రూపొందించాలనే ఆలోచన ఉండేది. ఈ క్రమంలో తన ఇంట్లో ఉన్న ఉప్పు నీటి సమస్య గురించి రాజేశ్ ఓసందర్భంలో ఉదయ్ తో చెప్పా డు. అప్పుడే తక్కువ ఖర్చుతో నీటి శుద్ధి పరికరాన్ని తయారు చేయాలని నిర్ణయించుకుని కొత్తపరికరాన్ని రూపొందించారు. ‘డిక్యాల్ వాటర్సాఫ్ట్​నర్’ పేరుతో ఒక పరికరాన్ని తయారుచేశారు.

ఏడాదికిపైగా పరిశోధన….

ఇంజనీర్లుగా పని చేసిన నేపథ్యంతోమా ఇద్దరికీ వివిధ ఉత్పత్తుల తయారీలోఅనుభవం ఉంది. మాకున్న పరిజ్ఞానంతో కొత్తపరికరాన్ని తయారు చేయాలనుకున్నాం. అందుకు దాదాపు ఏడాదిపాటు కష్టపడ్డాం. కొత్త టెక్నాలజీలను పరిశీలించడం,ల్యాబులకు వెళ్లాం . నిపుణులను కలిశాం . అలాచాలా ఎక్స్​పీరియన్స్​ చేశాక ఒక పరికరాన్నితయారు చేశాం. అదే ‘డిక్యాల్ వాటర్ సాఫ్ట్​నర్’. ‘బీఫాచ్ ఫోర్ ఎక్స్​ ప్రైవేట్​ లిమిటెడ్’ అనేసంస్థను ఏర్పా టు చేసి ‘డిక్యాల్’ పేరుతో దీన్నితయారు చేస్తున్నాం.

తక్కువ ఖర్చుతో…

ఇప్పటికే మార్కెట్లో రకరకాల వాటర్ సాఫ్ట్​నర్లు,ప్లాంట్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి చాలా ఖరీదైనవి. పాతిక వేల రూపాయల నుంచిమొదలై లక్షల ఖరీదైనవి ఉన్నాయి. పైగా వాటి ఇన్ స్టలేషన్, పవర్, మెయింటెనెన్స్​కు ఇంకాఖర్చు పెట్టాలి. వీటి వల్ల కనీసం ముప్పై శాతంనీళ్లు వృథాగా పోతాయి. కానీ, ‘డిక్యాల్ వాటర్సాఫ్ట్​నర్’తో ఇలాంటి చికాకులు ఉండవు. ఇతర ప్లాంట్లతో పోలిస్తే దీని ఖరీదు కూడా చాలా తక్కువ. దాదాపు మూడున్నర వేల రూపాయలు ఖర్చవుతుంది. దీనికి ఎలక్ట్రిసిటీ, మెయింటెనెన్స్​చార్జీలు ఉండవు.

ఎంతకాలం పనిచేస్తుందంటే..?

దీన్ని ఏర్పా టు చేసుకోవడం చాలా సులభం. ఒక్కసారి నీటి ట్యాంకులో ఏర్పాటు చేస్తే చాలు దాదాపు ఏడాదిపాటు పని చేస్తుంది. మూడు లక్షలకుపైగా లీటర్ల నీటిని శుద్ధి చేయగలదు. ప్రత్యేకంగా ఎలాంటి నిర్వహణ ఖర్చు ఉండదు.పోయిన సంవత్సరం అందుబాటులోకితెచ్చాం . ఈ పరికరాన్ని ఇండియాలోఎక్కడికైనా డెలివరీ చేస్తున్నాం. ఆన్ లైన్ లోకొనుక్కోవచ్చు . ఇతర ప్లాంట్ లు , సాఫ్ట్‌‌నర్‌‌లతోపోలిస్తే తక్కువ ఖర్చు తోనే ఉప్పు నీటిని శుద్ధిచేసే ఈ పరికరానికి ఏడాదిలోపే మంచిఆదరణ దొరికింది’ అని చెప్పా రు రాజేశ్,ఉదయ్ లు. త్వరలోనే డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలోఉన్నారు. ఇరవై పైసలకే లీటరు నీటిని శుద్ధిచేసే వాటర్ బాటిల్ తయారు చేస్తున్నారు. తక్కువ ఖర్చు తోనే వినియోగదారులకుమంచి నీళ్లు అందించాలనే లక్ష్యంతోనే వీటినిరూపొందిస్తున్నట్లు తెలిపారు.

జబ్బులకు దారి….

ఉప్పు నీటిని అస్సలు తాగకూడదు. ఈ నీళ్లుతాగి తే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది.ఇతర కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు,హై బీపీ వంటి సమస్యలు కూడా రావొచ్చు .పిల్లల్లో అయితే పెరుగుదల రేటు తగ్గుతుంది.గ్యాస్ట్రిక్ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు,నాడీ సంబంధ సమస్యలు వచ్చే అవకాశంఉంది. లవణాల ప్రభావానికి చర్మ సమస్యలుఅన్నింటి కంటే ఎక్కువగా వస్తాయి. నిజానికిసాధారణ లవణాలతో కూడిన నీళ్లైతే పర్లేదు.కానీ, వాటి పరిమాణం ఎక్కువై, పూర్తి ఉప్పునీటిగా మారితే మాత్రం ఇలాంటి అనారోగ్యసమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి జబ్బులు రాకూడదనుకుంటే నీటిని శుద్ధి చేసుకోవడమేపరిష్కారం.

హార్డ్‌ వాటర్‌‌. సాధారణ భాషలో ఉప్పునీరుగా పిలుస్తా రు. ఈ నీటిలోక్యాల్షియం కా ర్బొనేట్, మెగ్నీషియం,పొటాషియం, సోడియం, క్లోరైడ్, సల్ఫైట్వంటి లవణాలు అధిక శాతంలోఉంటాయి. వీటి వల్ల నీరు ఉప్పగాఅనిపిస్తుంది. నీటిలో ఉండే లవణాల స్థాయిని బట్టి నీటికి కఠినత్వం వస్తుంది.ఈ నీళ్లను సాధారణ అవసరాలకువాడినా ఇబ్బందిగా ఉంటుంది. ఏళ్ల తరబడి ఈ నీటిని వాడే ఇంట్లో ని పాత్రల్లో లవణాలు గడ్డకట్టుకుని పేరుకుపోతాయి. బకెట్లు, సింకులు,ట్యాపులు, పైపుల లోపలి గోడలపైగట్టిపడి కనిపించే పొర ఉప్పు నీళ్ల వల్లే ఏర్పడుతుంది. ఈ నీళ్లతో స్నానం చేస్తే చర్మం రంగు మారడంతోపాటు పొడిబారుతుంది. జుట్టు ఊడటమో,తెల్లబడటమో జరుగుతుంది. ఎక్కువ వయసు వారిలా కనిపిస్తా రు. బట్టలు ఉతికితే, వాటిపై ఉప్పులా ఒక పొరపేరుకుపోయి కనిపిస్తుంది. వాషింగ్మెషీన్లలో ఈ నీటితో బట్టలు వాష్ చేస్తే అవి త్వరగా పాడవుతాయి. ఈ నీళ్లు మొక్కల పెంపకానికి కూడా అంతఅనుకూలం కాదు. తాగడానికైతే అస్సలు పనికిరావు. ఇలాంటి నీటిని శుద్దిచేసుకోవడం తప్పనిసరి.

Latest Updates